18 May, 2026 | 3:30 AM

బదిలీపై వెళ్లిన సిబ్బందికి ఘనంగా వీడ్కోలు

18-05-2026 02:20 AM

బాన్సువాడ, మే 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో గత కొంతకాలంగా విధులు నిర్వహించి వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయిన 13 మంది సిబ్బందికి ఆదివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన సిబ్బందిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. బాన్సువాడలో వారు అందించిన సేవలను, శాంతి భద్రతల పరిరక్షణలో వారి కృషిని సిఐ శ్రీధర్ కొనియాడారు. కొత్త స్టేషన్లలో కూడా అదే అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ పాల్గొని బదిలీపై వెళ్తున్న సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు. స్టేషన్లో అందరితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను సిబ్బంది గుర్తు చేసుకున్నారు.