పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలి
మరిపెడ (మహబూబాబాద్) మే 17(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై, వాహన దారులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని సీపీఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ అన్నారు. పెట్రోల్, డీ జ్పి లీటరుకు రూ.3, వాణిజ్య గ్యాస్ సిలిండ్ప రూ.100 పెంపు ప్రజావ్యతిరేక నిర్ణయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపు బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని పేర్కొంటూ, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చే స్తూ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పెంపుతో ఇబ్బందులు పడుతున్న ప్ర జలపై ఇంధన ధరల పెంపు మరింత భా రంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కా ర్పొరేట్ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎండి అబ్దుల్ రషీద్, పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, అంజి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






