8 August, 2026 | 2:15 AM

ఘనంగా మహిషాసుర మర్దిని జాతర

08-08-2026 12:00 AM

గజ్వేల్ ఆగస్టు 7  (విజయక్రాంతి) : గజ్వేల్ మండలం బెజవాడ గ్రామంలో శాతవాహనుల కాలం నాటి అతి పురాతన ఆలయమైన మహిషాసుర మర్దిని జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ నక్కిర్త గోపాల్ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దిని అమ్మవారికి, అలాగే నాగరాజు, మనసా దేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్, కంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ లు నరేందర్ రెడ్డి, విజయ మోహన్, ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరు మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు  నాయన యాదగిరి, నక్క రాములు గౌడ్,  వెంకట నరసింహారెడ్డి, ముత్యాలు, శివారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఉపాధి కోసం వెళ్ళిన గ్రామస్తులు గ్రామానికి తరలివచ్చి అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు.