17 August, 2026 | 5:07 AM

వైభవంగా శ్రీరంగనాయకస్వామి కల్యాణోత్సవం

17-08-2026 12:54 AM

పాల్గొన్న పలువురు ప్రముఖులు

ఘట్ కేసర్, ఆగష్టు 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఎదులాబాద్ లోని శ్రీగోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయం ఆవరణలో ఆది వారం ఉదయం శ్రీరంగనాయకస్వామి క ళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా క న్నుల పండువగా జరిగింది. ఆలయ బ్రాహ్మనోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొని ప ట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులు డాక్టర్ భద్రారెడ్డి డాక్టర్ ప్రీతి రెడ్డి పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ఆవరణ, ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్,

ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామల అమర్, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొక్క సంజీవరెడ్డి, పన్నాల కొండల్ రెడ్డి, బోనకుర్తి అర్జున్, చలువాది ప్రవీణ్ రావు, కె. కరుణాకర్, సురేష్ నాయక్, పోత్నకని మల్లికార్జునరాజు, దేవాలయ వంశపా రంపర్య ధర్మకర్తలు టి.పి. లక్ష్మణ చార్యులు, వెంకటా చార్యులు, పురుషోత్తమా చార్యు లు, శేషాచార్యులు, వేణుగోపాలా చార్యులు, అనంత శేషాచార్యులు, పార్థసారధి చార్యు లు, రఘునాథ చార్యులు, రాజగోపాలా చార్యులు తదితరులు పాల్గొన్నారు.