26 August, 2026 | 7:56 PM

గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

26-08-2026 06:58 PM

జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్

కామారెడ్డి,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ఓటరు జాబితాను పరిశీలించి తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విజ్ఞప్తి చేశారు.