5 August, 2026 | 6:01 PM

ఇక నుండి అన్ని రకాల ఎరువులు యాప్‌లోనే

05-08-2026 04:56 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మర్కల్ గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్బంగా వ్యవసాయ విస్తరణ అధికారి లిఖిత్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎరువుల కోసం ప్రవేశపెట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ యాప్ రేపట్నుంచి అమలు కాబోతుందని, కావున రైతులందరూ ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోగలరని ఏఈఓ సూచించారు.

ఈ యాప్ లో యూరియాతోపాటు డిఏపి ఇతర కాంప్లెక్స్ ఎరువులు అన్ని ఒకే యాప్ లో బుక్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగిందన్నారు. యాప్ ను ఆధార్ కార్డు లేదా ఫార్మర్ హిస్టరీ ఐడి తో లాగిన్ అయి సర్వే నంబర్లు పంట వివరాలు నమోదు చేసి రైతులు ఎరువులను బుక్ చేసుకోవలన్నారు. బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ స్కానర్ వస్తుందని, దానిని బుక్ చేసుకున్న డీలర్ చూపిస్తే ఎరువులు తీసుకోవచ్చన్నారు.

ఈ యాప్ ద్వారా రైతులు సులభ పద్ధతిలో అన్ని రకాల ఎరువులను పొందవచ్చాన్నారు. దానితోపాటు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని, ఫామ్ పండ్స్ ఏర్పాటు చేసుకొని వర్షం నీటిని ఆదా చేసుకొని పంటలకు వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కల్ గ్రామ సర్పంచ్ ప్రియాంక సుభాష్ రెడ్డి, మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఇతర శాఖ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.