27 August, 2026 | 5:40 PM

ఓటరు సవరణలపై గ్రామసభ

27-08-2026 04:34 PM

కొండపాక,(విజయక్రాంతి)కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఓటరు సవరణల ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ భవిత, కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ భవిత మాట్లాడుతూ ఓటరు జాబితా పరిశీలనలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు.

ఇంటి నంబర్, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే సవరణలు చేయించుకోవాలని తెలిపారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీపీఓ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి శోభ, దుద్దెడ సర్పంచ్ మీది శివకుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.