27 August, 2026 | 10:22 PM

త్రివేణి పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

27-08-2026 05:27 PM

పాల్వంచ, (విజయక్రాంతి): స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట క్రాస్‌రోడ్‌లో గల త్రివేణి పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. పాఠశాలలోని హరిత వర్ణ సమూహం ఆధ్వర్యంలో ఈ వేడుకలను రమణీయంగా కొనసాగించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని విద్యార్థులకు ఆయా తరగతుల వారీగా రక్షాబంధన్ కార్యక్రమాలను నిర్వహించారు.

రక్షాబంధన్ పండుగ ఆవిర్భావం, దాని చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యతతో పాటు నేటితరం బాలబాలికల్లో ఉండవలసిన సోదరభావం, ప్రేమ, ఆప్యాయతల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో రక్షాబంధన్ మంత్రాన్ని చదివించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు, సి.ఆర్.ఓ. మాట్లాడుతూ సోదర, సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధానికి, ప్రేమానురాగాలకు రక్షాబంధన్ పండుగ నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, కిడ్స్ ఇన్‌చార్జ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.