17 May, 2026 | 1:18 AM

సీఎం రేవంత్ పగటి కలలు

17-05-2026 12:00 AM
  1. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల్లో ఏం అమలు చేశారో ముందు చెప్పాలి
  2. నీవు 2034 వరకు సీఎంగా ఉండడం.. రాహుల్‌గాంధీ ప్రధాని అవ్వడం హాస్యాస్పదం
  3. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుందా?
  4. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉం టానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి అనడం, రాహుల్‌గాంధీ ప్రధాని అవ్వడం హాస్యాస్పదమే నని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందాని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూ స్తుంటే.. ప్రజా సమస్యలపై అవగాహన కన్నా, పగటి కలలపైనే ఆయన ఎక్కువ దృ ష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి... మీరు, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చి న హామీలు, గ్యారంటీలు, వాగ్ధానాలు ఏం అమలు చేశారో ముందుగా చెప్పండి’ అం టూ ఆమె ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని.. వాపును చూసి బలుపు అనుకుంటు న్నారని ఆమె విమర్శించారు.

ప్రజల అసలు తీర్పు వచ్చే రోజులు ముందున్నాయని, అ ప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. శుక్రవారం సీఎం రేంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన డీకే అరుణ శనివారం స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమని, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉందన్నారు. 

రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల ఆందోళనలు, మహిళల భద్రత సమస్య, పెండింగ్ హామీలు.. ఇవన్నీ పక్కన పెట్టి 2034 వరకు సీఎం కుర్చీ గురిం చి మాట్లాడటం ప్రజలను అవమానించడమే అన్నా రు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదమని, వరుసగా మూడుసార్లు దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికే భారీ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారని అన్నారు.

అసలు 2034 వరకు కాంగ్రె స్ పార్టీ దేశంలో ఉం టుందా.. లేక పూర్తిగా పతనమవుతుం దా అన్నదే ప్రశ్నగా మారిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో రా హుల్‌గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పించే వ్యాఖ్యలేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ మాటలు ‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’లను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు.