యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి
అదనపు లారీలు సమకూర్చాలి
సెంటర్లో తాగునీరు, నీడ వసంతని కల్పించాలి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 21: ధాన్యం కొనుగోళ్ళను యుద్ధ ప్రాతిపదికను చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళవారం నల్లగొండలోని ఇందిరాభవన్ లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి యాసంగి వరి ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా లైట్లు ఏర్పాటు చేసి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.
ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి, అక్కడ అదనపు లారీలను అందుబాటులో ఉంచాలని, రైతులు రోడ్లపై ధాన్యం పోయకుండా, అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో నిర్ణీత సమయంలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనే సుమారు 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలు అధికారులు పాల్గొన్నారు.






