ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ ఏప్రిల్ 21: జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.. మంగళవారం కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు.
గతంలో రోజుకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా వరి కోతలు ఎక్కువ కావడంతో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసె లా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌళిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రలు, టార్ఫలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమములో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, స్పెషల్ అధికారి పద్మజ, కనగాల నారాయణ, సి ఓ వెంకటేశ్వర్లు, అధికారులు, రైతులు వ్యవసాయ శాఖ అధికారులుతదితరులు పాల్గొన్నారు.






