ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి
- జిల్లా సహకార అధికారి రామ్మోహన్..
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధారి, గుర్జాల్, మాతుసంగెం, పేట్ సంగెం కొనుగోలు కేంద్రాలను శనివారం నాడు జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మార్క్ ఫెడ్ డిఎం క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. కేంద్రాల వద్ద గల ధాన్యం వరి, మొక్కజొన్న, జొన్న లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ గాంధారి పాక్స్ ఛైర్మన్ పెద్దబూరి సాయికుమార్, ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, సొసైటీ కార్యదర్శి గాండ్ల సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్,మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు , రైతులు పాల్గొన్నారు.






