21 April, 2026 | 8:58 PM

అంగన్వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

21-04-2026 07:18 PM

పోషణ్ పక్వాడ్ ద్వారా పోషకాహారంపై అవగాహన

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండల పరిధిలోనీ గుర్రాలగొంది గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న చిన్నారులకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.

ఈ సందర్భంగా మండల స్థాయి ఎనిమిదవ పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పోషకాహారం ప్రాముఖ్యత, దాని సక్రమ వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్, ఉప సర్పంచ్ బెజగం కృష్ణ, గ్రామ సెక్రటరీ అరుణ, వార్డు సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.