11 August, 2026 | 3:31 AM

దమ్మాయిగూడ శ్రీచైతన్య హాస్టల్లో టెన్త్ విద్యార్థిపై దాడి

11-08-2026 01:08 AM

ర్యాగింగ్ పేరుతో 12 మంది విద్యార్థులు దాడి చేసినట్లు ఆరోపణ

జవహర్‌నగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూ ల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థు లు కలిసి కర్రలు, పైపులతో దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.

అంతటితో ఆ గకుండా బూట్లతో ముఖంపై తొక్కుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపారు. దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే మెట్లపై నుంచి కిందపడిపో వడంతో తమ కుమారుడికి గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చె ప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకురాగా అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ర్యాగింగ్ పేరుతో దాడి?

తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేసినట్లు తల్లిదండ్రులకు అభిషేక్ చెప్పినట్లు సమాచారం. దీంతో అసలు ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని విచారించిన సమయంలో తోటి విద్యార్థులే దాడి చేశారని చెప్పినట్లు తెలుస్తోంది.