ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేర్చేలా కృషి చేయాలి
- జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్
హైదరాబాద్,(విజయ క్రాంతి): ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేర్చేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. జిల్లా పర్యటన లో భాగంగా గవర్నర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా అధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా అధికారులను గవర్నర్ కు పరిచయం చేశారు. అధికారులు తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని గవర్నర్ కు వివరించారు.
జిల్లాపై ఎల్ నీనో ప్రభావం ఉందా?
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీనీ ప్రోత్సహిస్తున్నారా అంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లు పాల్గొన్నారు.






