25 August, 2026 | 7:44 PM

అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

25-08-2026 07:08 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని 28 గ్రామాల ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా కోరారు. వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హత కలిగిన వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.పెన్షన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-08-2026.అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.