బీసీల హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలి
25-08-2026 07:06 PM
హుస్నాబాద్: బీసీల హక్కుల సాధన కోసం ఐక్యమై పోరాటం చేయాలని ఆ సామాజిక వర్గ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ కమిషన్ నిర్మాత బి.పి. మండల్ 108వ జయంతి వేడుకలను బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.పి. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ జనాభా 56 శాతం ఉన్నప్పటికీ 25 శాతం లోపే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని బీసీ నాయకులు పేర్కొన్నారు. దేశ ప్రధానులుగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీసీ నేతలు కాలేదని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.






