9 August, 2026 | 3:39 AM

బ్రాహ్మణ ఉద్యమకారులను మరచిన ప్రభుత్వాలు

09-08-2026 12:00 AM

ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పో షించిన బ్రాహ్మణులనుగత ప్రభుత్వంతో పాటు నూతన ప్రభుత్వం తీవ్ర అన్యాయం చే స్తుందని తెలంగాణ బ్రాహ్మణల ఉద్యమ కా రుల ఐక్య వేదిక ప్రతి నిధులు ఆరోపించా రు. ఈ మేరకు శనివారం హైదర్గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు డా. యజ్ఞం పవన్ కుమార్ శర్మ, పోచంపల్లి రమణ రావు, అకినేపల్లి వేణుగోపాల్ రావు, ఉరే ప్రసాద్ రావు, గంపా రామారావు శర్మ, గూడ రాజేశ్వర్ రావు, చకిలం నర్సింహా రా వు, నర్సాపురం రవి కిరణ్, శ్రవణ్ కుమార్.

శ్రీధర్ రావులు (బ్రాహ్మణ్ ఫర్ సోషల్ రీ -ఇంజనీరింగ్ ఇంక్లూజివ్ ఎంపవర్మెంటు నె ట్వర్క్ డెవలప్మెంట్ సిస్టం) ను ఆవిష్కరించి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ హయాంలో తె లంగాణ బ్రాహ్మణ పరిషత్ ను ప్రారంభించి మరిచిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిషత్ ను పునరుద్ధరించి తెలంగాణ ఉద్యమం తో సంబంధం లేని వారికి చైర్మన్, వైస్ చైర్మ న్ గా నియమించి నిజమైన ఉద్యమకారుల కు అన్యాయం చేశారని ఆరోపించారు. అదే విధంగా 25 కోట్లు నిధులు మంజూరు అయ్యినట్లు ప్రచారం జ రుగుతుందని, ఈ విషయంలో స్పష్టత లేద ని తెలిపారు. నామిటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు.