30 April, 2026 | 5:44 AM

ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం

30-04-2026 12:57 AM

పెబ్బేరు, ఏప్రిల్ 29: పెబ్బేరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పట్టుదల, కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో అత్యుత్తమ ఫలితాలను సాధించి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను గర్వపడేలా చేశారు. అలాగే పదవ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన తెలంగాణ మోడల్ స్కూల్, పెబ్బేర్‌మరోసారి తన ప్రతిభను చాటింది.

ఈరోజు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా స్థాయిలో రికార్డు సృష్టించింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 96 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులై విశేష ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తూర్పింటి నరేశ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల సమిష్టి శ్రమ ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ, పాఠశాల అభివృద్ధికి ఇది మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.