మావలలో వనమహోత్సవం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా మావల రైతు వేదికలో మంగళ వారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని, ప్రతి కుటుంబం పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీవో నందిని, టీఏ మాధురి, ఏపీవో రజిని, వ్యవసాయ అధికారి ఆస్రాఫ్, ఏఈవో ఎం.రమేష్, ఏడీఏ శ్రీనివాస్, ఎస్టీఎం సంధ్య, బీసీఎం అరుణ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రామ్‌గోపాల్ వర్మ, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసావర్గావ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బట్టిసావర్గావ్ కార్యదర్శి అశోక్, మావల కార్యదర్శి విజయలక్ష్మి, వార్డు సభ్యులు రోడ్డ గంగన్న , అనంతూల లక్ష్మణ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






