27 May, 2026 | 3:23 AM

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

27-05-2026 12:50 AM

మహిళా సంఘాలకు చీరల పంపిణీ

టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి 

సంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి): మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలను పూర్తిగా మహిళా సంఘాల సభ్యులకు అందించినట్లు తెలిపారు. పట్టణంలో 212 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో అనరులకు కేటాయించిందని విమర్శించారు.

అధికారులు కూడా అందుబాటులో ఉండేవారు కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమ ని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారని తెలిపారు. ఇం దిరా శక్తి కింద 119 మందికి రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. చీరలు రెండు రంగుల్లో ప్రభుత్వం పట్టణంలో 29 వేల మంది మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టిఎంసి విజయభారతి, కౌన్సిల ర్లు, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.