2 May, 2026 | 1:24 AM

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

02-05-2026 12:00 AM

టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి 

సంగారెడ్డిలో ఘనంగా మే డే వేడుకలు

సంగారెడ్డి, మే 1(విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ  దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి ,అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు.