6 May, 2026 | 11:24 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

22-01-2026 05:46 PM

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని,జనవరి22(విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.   సింగరేణి ఏరియా హాస్పటల్‌లో ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ సెంటర్ పనులను గురువారం ఎమ్మెల్యే,  జీఎం లలిత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ, క్యాథ్ ల్యాబ్ ప్రారంభమైతే రామగుండం పరిసర ప్రాంతాల ప్రజలు గుండె సంబంధిత చికిత్సల కోసం కరీంనగర్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం పొందవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా హాస్పటల్‌కు రెండు ప్రవేశ మార్గాలు ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.