పాత యూనిఫాంతోనే బడికి..
- కొత్త డ్రెస్ల పంపిణీలో జాప్యం.
- ఏటా ఇదే పరిస్థితి..
- పాత దస్తులతోనే స్కూళ్లకు
- యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు.. మూడు నెలల సమయం..
- వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేత
బోదన్, జూన్17 (విజయక్రాంతి): స్కూళ్లు రీ ఓపెనింగ్ అయినప్పటికీ విద్యార్థులుకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయలేదు. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల్లో పేద, ధనిక భేదాభిప్రాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం యూనిఫాంను అందజేస్తుంది.
యూనిఫాంకు సంబంధించిన వస్త్రాల జాప్యం నేపథ్యంలో అవి ఇంకా సిద్ధం కాని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు అందించే యూనిఫాం విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారు లు శ్రద్ధచూపడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత వస్త్రాలు స్కూల్ కు చేరుకుంటున్నాయి. విద్యార్థులు.. కొలతలు తీసుకుని, యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు మూడు నెలల సమయం తీసుకుంటారు.
దీంతో సకాలంలో పిల్లలకు దుస్తులను ఇవ్వలే కపోతున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో వస్త్రాలను పాఠశాలలకు పంపిస్తే.. పిల్లల కొలతలు తీసుకొని.. స్కూళ్లు తెరిచే నాటికి కొత్తవి అందించవచ్చని తల్లిదండ్రులు చెబుతు న్నారు. బోధన్ పట్టణంలో, మండలంలో 8447 మంది విద్యార్థులు, ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు. అలాగే సాలుర మండలంలో 1400 విద్యార్థులు ఉన్నారు. బోధన్ పట్టణంలో, మండలంలో ప్రభుత్వ స్కూళ్లు ఉండగా... వాటిలో 8447 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికీ పాత దుస్తులే దర్శనమిస్తున్నాయి.
ఆచన్ పల్లి, పండుఫారంలో పాత యూనిఫాంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు.. విద్యా సంవత్సరం ప్రారంభమైన ముగిసి, సెలవులు పూర్తయ్యి.. స్కూళ్లు తెరిచే సరికి అవి పాతబడి చిరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచిన సమయంలో విద్యార్థులు పాత దుస్తులతోనే వస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవ త్సరం ఆరంభం నుంచే పాఠ్య పుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు కూడా అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఏడాది ఎంత మేర వస్త్రాలను ఆర్డర్ ఇచ్చారనే అంశంపై ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎం,ఈ,ఓ ల నుంచి వివరాలు తీసుకున్నారు.
త్వరలోనే అందజేస్తాం
ప్రభుత్వం కొత్త రకం డ్రెస్సులు సెలక్షన్ చేశారు. త్వరలో అందజేస్తాం. బోధన్ పట్టణంలో, మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు త్వరలోనే సప్లయ్ చేస్తాం. పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం ఉండదు. మండలంలోనే కాదు రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు ప్రతి ఏడాది ప్రభుత్వం నాణ్యమైన దుస్తులను పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా అందజేస్తాం.
- పాండుఫారం
ఆచన్‌పల్లి పాఠశాల బోధన్
ఒక్కో స్టూడెంట్కి రూ.100 ఖర్చు..
గవర్నమెంట్ స్కూళ్లలోని స్టూడెంట్స్ కు యూనిఫాంల కోసం ప్రభుత్వం ఏటా ఒకరి కి రూ.100 చొప్పున ఖర్చు చేస్తోంది. ఈవస్త్రం కొనుగోలుకు రూ.60, కుట్టు కూలి కింద రూ.50 చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల కూలి చాలా తక్కువగా ఉందని దర్జీలు సైతం దుస్తులు కుట్టడానికి ముందుకు రావడం లేదు.
- ఎ. నాగయ్య,
మండల విద్యాధికారి బోధన్






