9 May, 2026 | 3:33 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

24-02-2026 12:04 AM

నవాబ్ పేట్, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలో గిరిజన  నిర్వహించిన సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ, గిరిజనుల ఆధ్యాత్మిక గురువైన సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్  సమాజంలో ఐక్యత, నీతి, సేవా భావం పెంపొందించేందుకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటి రోడ్డు వేసి, తండాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు తులసీరామ్ నాయక్ ,కాంగ్రెస్ మండల అధక్షుడు రాంచంద్రయ్య,మార్కెట్ చెర్మన్ హరిలింగం ,మండల యూత్ అధక్షుడు హరిలింగం ,శ్రీను నాయక్ ,అంజన్ యాదవ్,  సర్పంచ్ లు జ్యోతి అంబదాస్ ,సంతోష్ నాయక్ ,లావుడియా లచ్చ్చి, గములమ్మ, సేవ్య,లక్ష్మణ్ ,లిమ్బ్య  పాల్గొన్నారు