18 July, 2026 | 12:30 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

18-07-2026 12:04 AM

సుల్తానాబాద్, జులై 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు బూత్ల లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను శుక్రవారం బీజేపీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి సందర్శించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అమలును పరిశీలించారు.

బూత్ల వద్దకొనసాగుతున్న ఓటరు నమోదు, సవరణలు, తొలగింపులు తదితర అంశాలపై బూత్ స్థాయి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భం గా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమైన సూచనలు చేస్తూ, ప్రతి అర్హుడైన ఓ టరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృ షి చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండలం అధ్యక్షులు కందు ల శ్రీనివాస్, బి ఎల్ ఏ వన్ బెజ్జంకి దిలీప్ కుమార్, ప్రధానకార్యదర్శులు కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.