13 April, 2026 | 3:13 AM

హెచ్‌సీఏకు త్వరలోనే మంచిరోజులు

13-04-2026 01:35 AM

కొత్త సెక్రటరీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 12 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను పారద ర్శకంగా నడిపిస్తామని ఇటీవలే కొత్తగా సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన జీవన్ రెడ్డి అన్నారు. క్లబ్ సెక్రటరీలు, అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన ఆయన అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. హెచ్‌సీఎకు త్వ రలోనే మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు.

క్లబ్ సెక్రటరీలకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా వచ్చి తనను కలవచ్చని, స్టేడియంలోని తన ఛాంబర్ లో అందుబాటులో ఉంటానని తెలిపారు. అసోసియేషన్‌ను అవినీతికి తావులేకుండా నడిపించడమే తన లక్ష్యమ న్నారు. ఆటగాళ్ల వయసు మోసాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ప్రతీ ప్లేయర్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డును అప్లికేషన్‌తో పాటు క్లబ్స్ తీసుకోవాలని సూచించారు. హెచ్‌సీఎ సెక్రటరీగా బాధ్యత లు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.