గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షో
లక్నో, ఏప్రిల్ 12: ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో వి జయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటిం గ్‌కు దిగిన లక్నోకు ఆశించిన ఆరంభం లభించలేదు. మార్ష్ (11) పరుగులకే ఔటవగా... పంత్(18), ఆయుశ్ బదోని (9) కూడా నిరాశపరిచారు. మార్కరమ్ (30) పర్వాలేదనిపించగా, పూరన్ (19) మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లతో లక్నోను దెబ్బతీశాడు. తర్వాత ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడింది. సాయిసుదర్శన్ (15) పరుగులకే ఔటైనా గిల్, బట్లర్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో వీరిద్దరూ ఔటైనా అప్పటికే గుజరాత్ విజయం ఖాయమైంది. రాహుల్ తెవాటియా 10 నా టౌట్, వాషింగ్టన్ సుందర్ 21 నాటౌట్ మ్యా చ్‌ను ముగించారు. గుజరాత్ మరో 8 బంతు లు మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది.




