30 May, 2026 | 11:51 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల! ఎంత పాస్ శాతం? ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు

12-04-2026 11:58 AM

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే పెరగడం విద్యార్థులకు ఊరట కలిగించింది.  తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల (IPE) ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఉపాధ్యక్షురాలు యోగితా రాణా (IAS)తో కలిసిఆదివారం విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 17 వరకు జరగగా, రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26, మార్చి 18 మధ్య జరిగాయి. నెలలోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. 

తాజా విద్యా వార్తల కోసం  Vijayakranthi హోమ్‌పేజీని సందర్శించండి

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగిందని, 2025లో మొదటి ఏడాది 66.91 శాతం, 2026లో 66.94 శాతం, అంతేకాక 2025లో ద్వితీయ సంవత్సరం 72.43 శాతం, 2026లో 75.61 శాతం ఉత్తీర్ణతం పెరిగింది. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచే  ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీన ముగిస్తుంది. అలాగే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20న చివరి తేది అని, సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభమై రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు. 

విద్యా సంబంధిత తాజా అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ న్యూస్ విభాగాన్ని చూడండి

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లైన tgbie.cgg.gov.in, results.cgg.gov.in నుండి తమ హాల్ టికెట్ నంబర్లను నమోదు చేసి ఇంటర్ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణ, వృత్తి విద్యా (Vocational) విభాగాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు, విద్యార్థులు తమ తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను, అలాగే ఉత్తీర్ణత స్థితిని IE Education పోర్టల్‌లో కూడా పొందవచ్చు.

FAQ

ప్ర: TS Inter Results 2026 ఎలా చెక్ చేయాలి?

సమాధానం: అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు చూడవచ్చు.

ప్ర: సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?

సమాధానం: మే 13 నుంచి ప్రారంభం అవుతాయి.

ప్ర: రీకౌంటింగ్ చివరి తేదీ ఏది?

సమాధానం: ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు ఖరారు

ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు ?

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ పోటీలకు కేయూ టీమ్..

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సన్నాహక సమావేశం

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలి