సన్నవరి రకాలు సాగు చేసే రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
ఎర్రుపాలెం ఆగస్టు 27 ( విజయక్రాంతి): మండల పరిధిలో గ్రామాలలోని రైతులు సన్న వరి రకాలు సాగు చేసే తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి సాయి శివ తెలిపారు. వరి సాగు చేసే రైతులు తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు సంబంధించిన సర్టిఫికెట్లతో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, విత్తన కొనుగోలు రసీదుతో సంబంధిత విత్తన డీలర్ వద్ద నమోదు చేయించుకోవాలని వివరించారు.
అదేవిధంగా రైతులు సొంత విత్తనాలు లేదా ఇతర రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన విత్తనాలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి సేకరించిన విత్తనాలు, ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రైతు ధ్రువీకరణ పత్రం సమర్పించి నమోదు చేయించుకోవాలని తెలిపారు. వరి సన్న రకాల నమోదుకు ఆఖరి గడువు 10-09-2026 కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని వెల్లడించారు.






