12 March, 2026 | 5:50 AM

26న థియేటర్‌లోకి గోట్

12-03-2026 12:16 AM

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు.   మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా ఉన్నతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సాంకేతికంగా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది’ అని నిర్మాత చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుందన్నారు.

దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని, తదితరులు నటించారు. సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ,  డీఓపీ: రసూల్ ఎల్లోర్, ఆడిషనల్ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, కో ప్రొడ్యూసర్: సమైరా రెడ్డి.ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ.