ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ మృత్యుంజయ్
కంటెంట్ కింగ్ శ్రీవిష్ణు, హుస్సేన్ షా కిరణ్ కాంబోలో తెరకెక్కిన ‘మృత్యుంజయ్’ చిత్రం మార్చి 6న థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం విజయవంతంగా దూసుకెళ్తోంది. గత వారం విడుదలైన చిత్రాల్లో ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ ‘మృత్యుంజయ్’ సత్తా చాటుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన మృత్యుంజయ్ మౌత్ టాక్, రివ్యూలతో ప్రస్తుతం భారీ విజయంతో దూ సుకుపోతోంది.
లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సి నిమాలోని కథ, కథనం కొత్తగా ఉండటం, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియె న్స్ అందించడంతో ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో సినిమా నడుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, నేచురల్ స్టార్ నాని ఇచ్చిన రివ్యూ లు సైతం సినిమా విజయంలో భాగమయ్యాయి. పోటీలో ఎలాంటి పెద్ద హీరోల చిత్రం లేకపోవడం ‘మృత్యుంజయ్’కి మరింతగా కలిసి వచ్చింది.




