19 August, 2026 | 3:54 AM

జీవో 97 రద్దు చేయాలి

19-08-2026 12:00 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 18: పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్ సాతర్ల డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థు లకు పాలిటెక్నిక్ విద్య కీలకమని, కళాశాలల ను బలోపేతం చేయాలని ఆయన కోరారు.