11 August, 2026 | 4:50 AM

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ అద్వైత జ్ఞానోద్యమానికి శ్రీకారం

11-08-2026 01:14 AM

గ్లోబల్ అద్వైత మిషన్ డైరెక్టర్ ఆనంద్ రెడ్డి 

ఖైరతాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): భగవద్గీత అద్వైత సిద్ధాంతంలోని ఆచరణాత్మక, హేతుబద్ధ, విశ్వజనీన జ్ఞానాన్ని ప్రపం చవ్యాప్తంగా మానవాళికి అందించాలనే సం కల్పంతో గ్లోబల్ అద్వైత మిషన్ ని ఏర్పాటు చేసినట్లు మిషన్ డైరెక్టర్ ఆనంద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 13 న హైదరా బాద్లోని శిల్పకళా వేదికలో ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిషన్ ప్రతినిధులతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. 2050 నా టికి 500 కోట్ల మందికి, 2100 నాటికి ప్రపంచ జనాభాలో 75 శాతం మందికి అద్వైత జ్ఞానాన్ని చేరవేయాలనే బృహత్తర లక్ష్యాన్ని ఈ మిషన్ నిర్దేశించుకుందని తెలిపారు. మతమార్పిడి ఈ మిషన్ ఉద్దేశం కాదని  స్పష్టం చేశారు. అజ్ఞానం నుంచి విచారణకు, విభజన నుంచి అవగాహనకు, సం కుచిత గుర్తింపుల నుంచి ఆత్మజ్ఞానానికి, తేడాభా వం నుంచి సమస్త జీవుల్లో ఒకే చైతన్యం ప్రకాశిస్తుందనే అనుభూతికి మానవాళిని నడిపించడమే దీని ముఖ్య ధ్యేయం అని అన్నారు. ముందస్తు నమోదు చేసుకున్న వారికి ఉచితం అని అన్నారు.