కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వండి
15-08-2026 01:01 AM
భైంసా, ఆగస్టు 14 (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన నిజమైన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కోరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులో కలిసి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమన్యాయం పాటిస్తూ పార్టీ సీనియర్ నేతలకు పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.






