15 August, 2026 | 3:39 AM

బ్యాంకుల్లో బంగారం భద్రమేనా?

15-08-2026 02:15 AM
  1. ఇండియన్ బ్యాంక్‌లో వరుస ఘటనలు
  2. మహబూబాబాద్‌లో 900 గ్రాముల బంగారం మాయం
  3. బెంగళూరు సహా పలు చోట్ల వెలుగులోకి అక్రమాలు
  4. అంతర్గత భద్రతా వ్యవస్థలపై సందేహాలు
  5. ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరించాలి
  6. ఫోరెన్సిక్ ఆడిట్లు తప్పనిసరి
  7. ఖాతాదారులూ అప్రమత్తంగా ఉండాలి   

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బ్యాంకు అంటే భద్రత.. లాకర్‌లో బంగారం పెట్టామంటే సురక్షితమనే నమ్మకం.. అవసరమైనప్పు డు, ఆపదలో ఆదుకుంటుందన్న ధైర్యం. కానీ, పైసాపైసా కూడబెట్టి, కష్టకాలంలో అక్కరకు వ స్తుందని తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకు గోడల మధ్యే గల్లంతవుతోంది. లోన్ల పేరుతో సామాన్యు లు తాకట్టు పెట్టిన బంగారంపై కన్నేసిన కొందరు ఉద్యోగులే.. అక్రమాలు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.

మహబూబాబాద్‌లో 700 గ్రాముల బంగారం మాయమైన ఘటనతో పాటు బెంగళూరు, సికింద్రాబాద్, రా జ్‌కోట్ తదితర ప్రాంతాల్లో బయటపడిన ఉదంతాలు బ్యాంకుల అంతర్గత భద్రతా వ్యవస్థలపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కాపాలా కా యాల్సిన చేతులే కాజేస్తే.. సామాన్యుల బంగారానికి భరోసా ఎక్కడ? అన్న ప్రశ్నలు వినిపిస్తు న్నాయి..  

ఇండియన్ బ్యాంకులో వెలుగుచూసిన కొన్ని ఘటనలు 

- మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో ఇటీవల రూ.90లక్షలు విలువ చేసే 700 గ్రాము ల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నెలవారీ ఆడిట్, రికార్డుల తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజు మరో ఐదుగురు ఉద్యోగులతో కలిసి 22 మంది ఖాతాదారుల ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిం ది. రాజు నివాసం నుంచి పోలీసులు కొంత బం గారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరికొం త బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టినట్లు తెలిసింది. విషయం వెలుగులోకి రావడంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. 

- ఈ ఏడాది ప్రారంభంలో సికింద్రాబాద్లోని సింధ్ కాలనీ ఇండియన్ బ్యాంక్ శాఖలో బంగారం మాయమైన ఘటన బయటపడింది. జోసెఫ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2025 జనవరిలో 200 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. విడిపించుకోవడానికి సదరు బ్యాంక్‌కు వెళ్లగా, అందులో చాలా వరకు అభరణాలు లేనట్లు గుర్తించాడు. కేవలం ఉంగరాలు మాత్రమే మిగలగా, మిగతా ఆభరణాలు కనిపించకుండా పోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

- ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని గిరినగర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ కుమార్ నెలల వ్యవధిలో 207 గోల్డ్ లోన్ ప్యాకెట్లలో 24 ప్యాకెట్ల నుండి 2.7 నుండి 2.8 కిలోల బంగారాన్ని (దీని విలువ రూ.4 కోట్లకు పైగానే) కాజే శాడు. నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా, కొన్ని ఆభరణాలను ప్రైవేట్ ఫైనాన్షి యర్ల వద్ద తాకట్టు పెట్టినట్లు గుర్తించారు.నగదులో కొంత వరకు రికవరీ చేశారు. తాకట్టు ద్వా రా తీసుకున్న నగదును ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 

- రాజ్‌కోట్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగులే రూ.64 లక్షలు విలువ చేసే బంగారం మా యం చేశారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇండియన్ బ్యాం క్ శాఖల్లో అక్రమాలు వెలుగుచూశాయి.

విస్తృతమైన భద్రతా వ్యవస్థలున్నా విఫలం

ఇండియన్ బ్యాంక్‌కు విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. మధ్యతరగతి, చిన్న వ్యాపార వర్గాలు తక్ష ణ అవసరాల కోసం ఆభరణాలను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటారు. నిబంధనల ప్రకారం బ్యాంక్ అంతర్గత వ్యవస్థల్లో రెండు తాళాల విధా నం, బంగారం ఉంచిన ప్యాకెట్లను సీల్ చేయడం, ఎప్పటికప్పుడు తనిఖీలు, సీసీటీవీ నిఘా ఉంటుంది. సిబ్బంది కుమ్మక్కైనా, ఉద్యోగికి ఒంటరిగా వాల్ట్ తెరిచే అవకాశం లభించినా కనిపెట్టా ల్సిన వ్యవస్థలన్నీ విఫలమవుతున్నాయని  వరుస సంఘటనలు నిరూపిస్తున్నాయి.

మహబూబాబాద్ కేసులో ఆడిట్ సమయంలోనే ఈ వ్యత్యా సం బయటపడగా, బెంగళూరులో ఖాతాదారుడు తన బంగారాన్ని విడిపించుకోవడానికి వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమా లు ఆలస్యంగా వెలుగు చూడటం, ద్వంద్వ నియంత్రణ అమలులో లోపాలు, కాజేసిన బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టడం వంటి వి వ్యవస్తీత లోపాలను ఎత్తి చూపుతున్నాయి. 

2025-26లో 10,114 కేసులు..

బ్యాంకింగ్ మోసాల తీవ్రతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు కూడా స్ప ష్టం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా నమోదైన మోసాల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. సొమ్ము విలువ గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,114 కేసులు నమో దు కాగా, వీటి విలువ రూ.48,021 కోట్లని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సిం హభాగం రూ.35,709 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే నమోదయ్యాయి. 

గోల్డ్ లోన్లకు సంబంధించిన ఘటనలే అధికం.  ప్రైవేట్ బ్యాం కుల్లో డిజిటల్, కార్డుల విషయంలోనూ అక్రమాలు పెద్దెత్తునే ఉన్నాయి.  అయితే ఈ గణాంకాల ఆధారంగా ప్రతీ శాఖలోనూ భద్రతా పరమైన లోపాలున్నాయని చెప్ప లేం. సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎక్కువ భాగం సాఫీగా జరుగుతా యి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాత కేసుల వర్గీకరణలో మార్పుల వల్ల కొంత కాలంలో పేర్కొన్న గణాంకాల వల్ల మోసాల విలువ పెరిగినట్లు కనిపించింది.

ఇక్కడ మరో ముఖ్యమైన తేడాను గుర్తించాలి. ‘డిపాజిట్ ఇ న్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్’ (డీఐసీజీసీ) ద్వారా.. ఒక బ్యాంక్‌లో ఒక డిపాజి టర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు బీమా రక్షణ ఉంటుంది. అయితే, రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చట్టపరంగా వేరే పరిధిలోకి వస్తుంది. బ్యాంక్ ఇక్కడ ఒక ‘రక్షకుడిగా’ (బైలీ) వ్యవహరిస్తుంది. వారు ఆభరణాలను య థాతథంగా తిరిగి ఇవ్వాలి లేదా నష్టపరిహారం చెల్లించాలి.

కానీ, ఉద్యోగులు బంగారాన్ని కాజేసినప్పుడు ఖాతాదారులు నెలల తరబడి రికవరీ ప్రక్రియలు, పోలీసు స్టేషన్లు, లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా, నష్టపోయిన ఆభర ణాల రికవరీ ఆలస్యమైతే ఒకవైపు లోన్ వడ్డీ భారం పడుతుండగా, మరోవైపు వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞాపకాలను కోల్పోయామనే మా నసిక వేదన మిగులుతుంది. స్వాహా చేసిన బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్‌లల్లో తాకట్టుపెట్టి, వచ్చిన నగదును దుర్వినియోగం చేసినట్లు చాలా కేసుల్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం ఖర్చు చేసినట్లు గుర్తించారు.  

ఎప్పటికప్పుడు ఆడిట్‌లు అవసరం

ఎప్పటికప్పుడు చేయాల్సిన ఆడిట్‌లు ఆలస్యమైతే.. వ్యవస్థలోని లోపాలు ఎక్కువ కాలం బయ టకు రాకపోవచ్చు. అధికారులు లేనప్పుడు, ఇతర సమయాల్లో ఆభరణాలు కాజేస్తే సీసీటీవీ పుటేజీలు కేవలం ఆధారాలుగా మాత్రమే ఉపయో గపడవచ్చు. కానీ, దొంగతనం జరగకుండా అడ్డుకోలేవు. అంతర్గత విచారణల తర్వాత అక్రమా లకు పాల్పడిన సిబ్బందిని బదిలీ చేయడం వల్ల జరిగిన అసలు నష్టాన్ని పూడ్చలేం.

అప్రమత్తతే ఏకైక మార్గం

గోల్డ్ లోన్లు తీసుకునేవారు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంతవరకు భద్రత విషయంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న బ్యాంకులు లేదా ఎఎన్‌బీఎఫ్‌సీలనే ఎంచుకోవాలి. రుణ సమయంలో బంగారు ఆభరణాల ప్యాకెట్లను సీల్ చేస్తున్నప్పుడు ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. లోన్ ఖాతాను తరచూ పరిశీలిస్తుండాలి. విలువైన ఆభరణాలను సుదీర్ఘకాలం ఒకే సంస్థలో ఉంచొద్దు.

అక్రమాలను అరి కట్టేం దుకు ఆర్‌బీఐ కూడా భద్రత మరింత పెంచా లి. నిరంతర పర్యవేక్షణ, ఫోరెన్సిక్ ఆడిట్లు, బయోమెట్రిక్, డిజిటల్ సీల్ వంటి ఆధునిక సాంకేతి కతను ఉపయోగించాలి. ఇంటి దొంగలపై వేగం గా, కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ బ్యాం కుల్లో తరచూ వెలుగుచూస్తున్న అక్రమాలు.. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.