బాలికలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఆరోగ్య స్క్రీనింగ్ క్యాంపులో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్ (విజయక్రాంతి): బాలికలు విధిగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందుకోసం ఆరోగ్య స్క్రీనింగ్ ఎల్లప్పుడూ చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకుల్ మౌనిక మహేందర్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ కాలనీలో గల బస్తీ దవాఖానాలో ఆరోగ్య స్క్రీనింగ్ క్యాంప్లో మాట్లాడారు. ఈ క్యాంపులో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండిన బాలికల కోసం ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారని ,వీరికి వ్యాక్సిన్ టీకాలు వేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఆరోగ్యం కలిగి ఉండొచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, తొడసం ఇందిరా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాయకులు గొర్రె గంగాధర్, మేష సతీష్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, బత్తుల లక్ష్మీనారాయణ, వైద్య, మెప్మా, ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.






