మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి.
పెద్దేముల్ లో ఘనంగా రాజీవ్ 35వ వర్ధంతి వేడుకలు
తాండూరు, మే 21, (విజయ క్రాంతి): భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని, టెలి కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ రంగాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం పెద్దముల్ మండల కేంద్రం ప్రధాన కూడలిలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ టెక్నాలజీని, టెలి కమ్యూనికేషన్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






