12-02-2026 11:38:58 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): లేబర్ కోడ్(Labour Code) ను రద్దు కోసం తలపెట్టిన సార్వత్రి సమ్మెకు కార్మికులు జేజేలు పలికారు. మందమర్రి ఏరియాలోని గనుల్లో సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ఉదయం షిఫ్ట్ లో కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. జాతీయ సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె లో భాగంగా సింగరేణిలో సమ్మెకు పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు శాంతిఖని, కాసిపేట - కాశిపేట 2 గనుల్లోసమ్మె జరుగుతోంది. కేకే -2 ఓసి మాత్రం యధావిధిగా నడుస్తోంది.
పాక్షికంగా సమ్మె ప్రభావం కనిపిస్తుంది. అధికారులు రాత్రి షిఫ్ట్ కార్మికులను అక్కడే ఉంచి ఓపెన్ కాస్ట్ ను నడిపిస్తున్నారని సమాచారం. ఓపెన్ కాస్ట్ సమ్మె పట్ల కార్మిక సంఘాలు నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ఓపెన్ కాస్ట్ నడుస్తున్నది. సమ్మె నాయకత్వ భాగస్వామ్య సంఘాల్లో ప్రధాన కార్మిక సంఘాల కీలకమైన నాయకులే ఓపెన్ కాస్ట్ సమ్మె ను విచ్ఛిన్నం చేస్తున్నట్లు ఆరోపణ వ్యక్తం అవుతున్నాయి. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. శాంతిఖని మొత్తం కార్మికులు, అధికారులతో సహా 480 మంది పనిచేస్తున్నారు.
మొదటి షిఫ్ట్ లో 150 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాసిపేట - 1గనిలో 1200 మ్యాన్ పవర్ కుగాను మొదటి స్థితిలో 300 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాసిపేట - 2 గనిలో 800 మంది కార్మికుల కు గాను మొదటి స్థితిలో 250 మంది విధులను బహిష్కరించి సమ్మె కొనుక్కున్నారు. కేకే - 2 ఓసీ లో మొత్తం 400 కార్మికులకు గాను 26 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఓసీ లో సమ్మె పాక్షికంగా జరిగింది. అత్యవసర సిబ్బంది, అధికారులు మాత్రమే గనులకు హాజరయ్యారు. మొత్తానికి అయితే సార్వత్రిక సమ్మె ఫలప్రదం అయింది. సమ్మె ప్రభావంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్పందించిపోయింది. నిర్మానుష్యంగా గనులు మారిపోయాయి.