25 August, 2026 | 4:56 PM

బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన సాధారణ సమావేశం

25-08-2026 01:49 AM

సికింద్రాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, డిప్యూటీ సీఈవో మాధవి భార్గవ్, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, ప్రత్యేక ఆహ్వాని తులుగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై చర్చించిన అనంతరం వివిధ పనులకు సంబంధించిన టెండర్ల ఖరారు, అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు..ఈ సమావేశంలో బోర్డు అధికారులు పాల్గొన్నారు.