25 August, 2026 | 6:00 PM

Breaking News

ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!   •   శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు: నీలం మధు ముదిరాజ్   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థి అక్షిత్   •   బీటీపీఎస్ కళాకారున్ని సన్మానించిన బిచ్చన్న సీఈ   •   అన్ని గ్రామాల్లో వనమహోత్సవం   •   ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి   •   మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   నిజామాబాద్ నషా ముక్త్ భారత్ కోసం యువత కృషి చేయాలి   •   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ   •  

అచ్చంపేట అభివృద్ధికి మహర్దశ

26-08-2026 12:00 AM
  1. నల్లమలకు కొత్త రవాణా బాట
  2. త్వరలోనే బుల్లెట్ రైలు, ఎలివేటెడ్ కారిడార్, నాలుగు లైన్ల రహదారులు
  3. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్యలు
  4. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదనలకు మంత్రి కోమటిరెడ్డి సానుకూల స్పందన

అచ్చంపేట, ఆగస్టు 24: అచ్చంపేట, నల్లమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం  మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బల్మూరులో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. శంషాబాద్ నుంచి మన్ననూరు వైపు బుల్లెట్ రైలు మార్గం ప్రతిపాదన ఉందని, మన్ననూరు, శ్రీశైలం మధ్య 52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ కోసం డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు.

హాజీపూర్ నుంచి అచ్చంపేట వరకు 6 కి.మీ. నాలుగు లైన్ల రహదారికి నిధులు మంజూరు చేస్తామని, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నల్లమలను ప్రత్యేక పర్యాటక జోన్గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రతిపాదించిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అచ్చంపేట అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ మల్లు రవి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.