25 August, 2026 | 6:56 PM

వనమహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ శంషాద్ బేగం

25-08-2026 04:37 PM

నాగల్‌గిద్ద: నాగల్‌గిద్ద మండల పరిధిలోని వల్లూర్ గ్రామపంచాయతీలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ శంషాద్ బేగం ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంషాద్ బేగం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు బాధ్యతగా సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజయ్య స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంచాక్షరి, అంగన్వాడీ టీచర్ జ్యోతి, షకీర్, జాంగీర్, వార్డు సభ్యులు నర్సింలు, రాజు రెడ్డి, భారతి, రుక్మిణి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.