4 March, 2026 | 4:33 PM

భిక్కనూరుకు చెందిన గీత మాధురి సైనిక్ స్కూల్‌కు ఎంపిక

04-03-2026 02:53 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి గీత మాధురి సైనిక్ స్కూల్‌కు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. సైనిక్ స్కూల్‌లో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షను ఆమె ప్రతిభతో విజయవంతంగా పూర్తి చేసింది. గీత మాధురి భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి బాలరాజు మరియు కన్యాకుమారి దంపతుల కుమార్తె. చిన్న వయసులోనే ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థకు ఎంపిక కావడం ఆమె కష్టపాటు, పట్టుదలకు నిదర్శనమని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె భవిష్యత్తులో దేశసేవ చేసే ఉన్నత లక్ష్యాలను సాధించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.