4 May, 2026 | 5:24 PM

ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచాలి

04-05-2026 04:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): పేద ప్రజల విద్య అవసరాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా ఇటీవల వెలువడిన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ ని అభినందిస్తూ, ఈ విజయానికి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేశారని కొనియాడారు. 

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి అంశాలలో కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్.టి.యు.టి.ఎస్. నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల నాణ్యమైన విద్య కోసం ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు.