4 May, 2026 | 5:38 PM

భైంసా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలి

04-05-2026 04:23 PM

బైంసా,(విజయక్రాంతి): పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏరియా హాస్పిటల్ రోగులకు అవసరమయ్యే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందవలసిన అవసరం ఏర్పడుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోగుల పరీక్షల కోసం ఏర్పాటుచేసిన వివిధ మిషన్లు పనిచేయడం లేదని వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు ఉన్నారు