4 May, 2026 | 5:15 PM

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!

04-05-2026 03:55 PM

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Tamil Nadu Election Results 2026) విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ అధికార DMK, AIADMK పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్ల 2 నెలల్లోనే విజయ్ చరిత్ర సృష్టించాడు. దీంతో తమిళనాడు అంతటా పార్టీ కార్యకర్తలు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి. టీవీకే, విజయ్ అంటూ నినాదాలు చేస్తుండగా, పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం బయట పార్టీ కార్యకర్తలు గుమిగూడి స్వీట్లు పంచారు.  2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం పార్టీ స్థాపించారు.

ఇలాంటి ఎన్నికల ఫలితాలు, రాజకీయ విశ్లేషణ కోసం మా Politics విభాగాన్ని చదవండి.

టీవీకే అధినేత విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న విజయ్ చెన్నైలో జన్మించారు. విజయ్ తండ్రి సినీ దర్శకుడు చంద్రశేఖర్, తల్లి గాయని శోభ. విజయ్ 1980ల్లో బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1992లో నాలైయ తీర్పు చిత్రంతో విజయ్ హరోగా మారాడు. 70 కిపైగా తమిళ సినిమాల్లో నటించిన విజయ్ స్టార్ గా ఎదిగారు. 2009లోనే విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట ఫ్యాన్స్ క్లబ్ లు ఏర్పాటు చేశారు. ఫ్యాన్ క్లబ్ లతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విజయ్ టీవీకే పార్టీ పొత్తు లేకుండానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది.

యువ, పట్టణ ఓటర్లను ఆకట్టుకుని టీవీకే రాజకీయశక్తిగా ఎదిగింది. ఎంజీఆర్, ఎన్టీఆర్, తర్వాత పార్టీ స్థాపించి విజయ్ విజయం సాధించారు.  ఇప్పటి వరకు వచ్చిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో  99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న TVK 10 స్థానాల్లో విజయం సాధించింది. DMK+ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాలు గెలిచింది. ADMK+ 54 స్థానాల్లో ఆధిక్యం, 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. తమిళనాడు రాజకీయాల్లో TVK అధినేత విజయ్ చరిత్ర సృష్టించారు. 

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ వార్తల కోసం Vijayakranthi News హోమ్‌పేజ్‌ను సందర్శించండి.


ఇవి కూడా చదవండి:

తమిళనాడులో సంచలన ఫలితాలు.. విజయ్ TVK రికార్డు

బీజేపీ ఆఫర్‌కు టీవీకే నో! — 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనను ఖండించిన విజయ్ పార్టీ

Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం

ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ