4 May, 2026 | 3:11 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

యూరియా కోసం రైతుల ఆందోళన

04-03-2026 02:49 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండలంలోని గునుకుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం మహమ్మద్ నగర్  వద్ద బుధవారం ఉదయం యూరియా కొరతతో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ గోదాంకు ఉదయం 666 యూరియా బస్తాలు చేరుకున్నట్లు సమాచారం అందడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రైతులు యూరియా యాప్‌లో బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమయ్యేలోపే నిమిషంలోనే మొత్తం 666 బస్తాలు ఖాళీ అయినట్లు యాప్‌లో చూపించడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తమకు యాప్‌లో స్టాక్ లేదు అని చూపెడుతుండగా, ఈ బస్తాలు ఎవరికి బుక్ అయ్యాయి ఎక్కడికి వెళ్లాయి అనే ప్రశ్నలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు అధికారుల కోసం వేచి చూసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా ఆగ్రహించిన రైతులు సొసైటీ అధికారులను నిలదీసే క్రమంలో కార్యాలయ క్యాబిన్‌కు గల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. అనంతరం సొసైటీ అధికారులు రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. యూరియా సరఫరా, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.