30 March, 2026 | 6:10 PM

పంజాగుట్ట శ్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా..

30-03-2026 04:26 PM

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రూ.6 వేలకు డీలర్ అమీర్ అమ్ముతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 414 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని, డీలర్ అమీర్ తో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీసీపీ రఘనాథ్ మాట్లాడుతూ... పంజాగుట్టలోని శ్మశాన వాటికలో సిలిండర్లు నిల్వ చేశారని, వారి నుంచి 414 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా ఈ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కట్ దందా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఉన్నట్లు నిందితులు వదంతులు సృష్టిస్తున్నారని ఆయన వివరించారు. రూ.2 వేలు ఉండే కమర్షియల్ సిలిండర్ ను అధికంగా రూ.6 వేలకు అమ్ముతున్నారని తెలిపారు ఈ బ్లాక్ దందాపై కేసు నమోదు చేసి నిందితుల నుంచి 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రఘనాథ్ వెల్లడించారు.