calender_icon.png 24 February, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో నేటి నుండి గరికపాటి ప్రవచనములు

24-02-2026 10:18 AM

శ్రీ ఆయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఏర్పాట్లు

 భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు

 అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్

మంథని, ఫిబ్రవరి24(విజయ క్రాంతి): మంథనిలో నేటి నుండి మూడు రోజుల పాటు 24, 25, 26 తేదీలలో మహా సహస్రావధాని  పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహా రావు ప్రవచనములకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మంథనిలోని మణికంఠ కళా ప్రాంగణం అయ్యప్ప దేవాలయం లో నిర్వహించుటకు నిర్ణయించనున్న ఈ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు. గరికిపాటి నరసింహారావు మంథని కి ఆహ్వానించుటకు ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కమిటీలో  కన్వీనర్ గా మంథని మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్  ప్రవళిక, ఆహ్వానితులుగా కొంతం సత్యనారాయణ, కొండ శంకర్ విజయలక్ష్మి , సభ నిర్వాహకులుగా అవధాని మోహన్ శర్మలను నియమించారు. మంత్రపురి ధర్మ ప్రచార సమితి మంథని ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో  భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మంథనిలోని మణికంఠ కళా ప్రాంగణం అయ్యప్ప దేవాలయం లో నిర్వహించుటకు  అయ్యప్ప ఆలయ కమిటీ భక్త బృందంచే ఈ కార్యక్రమం నిర్వహణకు ఘనంగా ఏర్పాటు పూర్తి చేశారు. కార్యక్రమం 24 తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి మంథని లోని గాంధీ చౌక్ ద్వారా  భక్త బృందంచే కోలాటాలతో  వేద పండితుల వేదాధ్యయనంతో  పురవీధుల నుండి శోభాయాత్రతో ప్రారంభమై మణికంఠ కళా ప్రాంగణము చేరుకుంటుందని వారు తెలిపారు. 

వారిని వారి కుటుంబ సభ్యులను అయ్యప్ప దేవాలయ కమిటీ సన్మానించిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కావున మంథని పుర ప్రముఖులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్త బృందం అందరూ ఆహ్వానితులుగా భావించి సహకరించాలన్నారు. డాక్టర్ గరికిపాటి నరసింహారావు గఇచ్చేటువంటి సందేశాన్ని సంతృప్తిగా స్వీకరించి వెళ్ళవలసినదిగా మీ అందరిని ప్రార్థిస్తున ఆలయ కమిటీ భక్త బృందం ఈ కార్యక్రమం నిర్వహణ జరుగును.  కార్యక్రమం 24 తేదీ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి మంథనిలోని గాంధీ చౌక్ ద్వారా  భక్త బృందం చే కోలాటాలతో   వేద పండితుల వేదాధ్యయనంతో  పురవీధుల నుండి శోభాయాత్రతో ప్రారంభమై మణికంఠ కళా ప్రాంగణము చేరుకుంటారని వారు తెలిపారు.