21 August, 2026 | 1:20 PM

ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక

21-08-2026 12:12 PM

సత్తుపల్లి ఆగస్టు 21( విజయ క్రాంతి ) సత్తుపల్లిలోని చేయూత మోటారు ఆటో మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం ఏడుకొండలు, ఉపాధ్యక్షులుగా ఎస్.కె. నజ్మొద్దీన్, సుభాని ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా టి. సురేష్, క్రాంతి కుమార్, గణేష్, రహంతుల్లా, మహ్మద్ రఫీలను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శంకరాచారితో పాటు ఎస్.కె. ఉస్మాన్, షరీఫ్, సుభాని, వీరభద్రరావు, జె. అబీయుల్లాలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎం. ఏడుకొండలు మాట్లాడుతూ.. చేయూత మోటారు ఆటో మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో మెకానిక్ వర్కర్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వర్కర్లు తమ వృత్తిని సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఆటోనగర్ ఏర్పాటుకు సత్తుపల్లి పట్టణంలో ఆటో మెకానిక్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కోరుతూ నూతన కార్యవర్గం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు.ఆటో మెకానిక్ వర్కర్ల సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్‌తో కలిసి ఆటోనగర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి, త్వరలో సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.తమ సమస్యపై సానుకూలంగా స్పందించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దివాకర, ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, రెవెన్యూ అధికారులకు చేయూత మోటారు ఆటో మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధితో పాటు మెకానిక్ వర్కర్ల సంక్షేమానికి ఐక్యంగా పనిచేస్తామని అధ్యక్షుడు ఏడుకొండలు తెలిపారు.